Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ అగ్ర నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో రికార్డుల వర్షం కురుస్తుండగా అమితాబ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సినిమాతో సినీ జనమంతా పుష్ప 2 మ్యానియాలో మునిగి తేలుతుండగా, రోజురోజుకూ సినిమాకు కనకవర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు విషయాల్లో పుష్ప 2 సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఆ సినిమా హీరో అల్లు అర్జున్ మాత్రం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో ఆందోళనలోనే ఉన్నారు.
Amitabh Bachchan: పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్‌కు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వచ్చింది. అలాంటి అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని బిగ్ బీ కొనియాడారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ మాట్లాడటం విశేషం.
Amitabh Bachchan: పుష్ప 2 సినిమాతో నేను అల్లు అర్జన్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యాను అని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి.. అతను ఒక గొప్ప నటుడు అని బిగ్‌బీ అల్లు అర్జున్ కొనియాడారు. ఈ మెచ్చుకోలుతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దేశంలోనే అత్యున్నత సీనియర్ నటుడి ప్రశంసంలు పొందడం విశేషమే.