Kamareddy Crime: అసలేం జరిగింది.. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరిని చంపి మరొకరు చెరువులో దూకి తనువు చాలించారా? వేధింపులతో మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకితే, మిగతా ఇద్దరు ఆమె వెంట దూకి బలయ్యారా? ఈ ముగ్గురినీ ఎవరైనా మట్టుబెట్టి, ఆ తర్వాత చెరువులోకి తోసేశారా? అసలేం జరిగింది? అన్న మిస్టరీ ఇంకా వీడనేలేదు.
Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో నిన్న వెలుగులోకి వచ్చిన చెరువులో ముగ్గురి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరులోని ఎల్లారెడ్డి పెద్దచెరువులో ఈ ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. అసలు విషయం మాత్రం ఇంకా తేలలేదు. పోస్టుమార్టం జరిగిన తర్వాతే అసలు విషయాలు తేలుతాయన్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Kamareddy Crime: ఈ మేరకు చెరువులో ముగ్గురి ఆత్మహత్య మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు అధికారిగా సదాశివనగర్ సీఐని నియమించారు. ఇప్పటికే ముగ్గురి కాల్ డేటాను పోలీసులు సేకరించినట్టు తెలిసింది. ఆ మేరకు వారి మధ్య సాగిన సంభాషణను ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు, పోన్ సంభాషణతో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. సాక్షులను కూడా విచారించారు. తోటి సిబ్బందితోనూ పలు విషయాలను రాబట్టారు.
Kamareddy Crime: భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో సాయికుమార్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా, బీబీపేట పోలీస్ స్టేషన్‌లో శృతి మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. బీబీపేటలోనే నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురూ చెరువులో విగత జీవులుగా పడిన ఘటన కలకలం రేపింది. గతంలో బీబీపేటలో సాయికుమార్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా శృతితో సన్నిహిత సంబంధం ఉండేదని తెలిసింది. ఆ తర్వాత నిఖిల్‌తో సన్నిహితంగా ఉండేదని తెలిసింది.
Kamareddy Crime: ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ మధ్యన మీడియేటర్‌గా నిఖిల్ వ్యవహరించారని గుసగుసలు. అయితే ఎస్ఐ బదిలీపై వెళ్లగా శృతితో నిఖిల్ కలిసి తిరిగేవారని సమాచారం. దీంతో వారి మధ్యన సన్నిహిత సంబంధం ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది నచ్చక ఎస్ఐ వారిని అక్కడికి రప్పించారా? లేక నిఖిల్, శృతి కలిసి వెళ్లిన విషయం తెలిసి ఎస్ఐ వారిని పసిగట్టేందుకు వెళ్లాడా? అన్న మిస్టరీ వీడటం లేదు. పోలీసుల దర్యాప్తులో ఈ రోజే అసలు విషయం తేలే అవకాశం ఉన్నది.