Venkaiah naidu: మావోయిస్టులపై కఠిన చర్యలు కొనసాగుతాయని మాజీ ఉపరాష్ట్రపతి M. Venkaiah Naidu స్పష్టం చేశారు. ఇప్పటికే జరుగుతున్న ఆపరేషన్‌లతో పాటు త్వరలోనే మరొక కీలక దాడి చర్యగా Operation Sindhoor-2 కూడా అమలు చేయబడుతుందని ఆయన అన్నారు.
మావోయిస్టులు నిజంగా సిద్ధాంతాలపై నమ్మకం ఉంచిన వారే అయితే, అడవుల్లో దాక్కోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల బరిలోకి రావాలని వెంకయ్య సవాలు విసిరారు. దేశానికి సిద్ధాంతపరమైన, నైతికత ఆధారిత రాజకీయాలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
తన వ్యక్తిగత రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, “నేను పదవికి మాత్రమే విరమణ చేశాను, పెదవికి కాదు” అని తెగువగా స్పందించారు వెంకయ్య. సమాజానికి తోడు నిలిచే విషయాల్లో ఇకముందూ తన పాత్ర కొనసాగుతుందని చెప్పారు.

