Vedhika: ఇటీవల వచ్చిన పీరియాడిక్ మూవీ ‘రజాకార్’లో కీలక పాత్ర పోషించి మెప్పించింది నటి వేదిక. ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ చేసిన ‘ఫియర్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమాను డాక్టర్ హరిత గోగినేని డైరక్ట్ చేశారు. అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకుంది. తాజాగా మేకర్స్ ‘ఫియర్’ మూవీని డిసెంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఇందులో ఇతర కీలక పాత్రలను పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఐ. ఆండ్రూ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
