Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కకపోవడంతో, ఈసారి హిట్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ఓ హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే ఆకర్షణీయ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్‌తో వరుణ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.
అటు ఈ చిత్రం తర్వాత, వరుణ్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు సైన్ చేయనున్నట్లు సమాచారం. రైటర్‌గా గుర్తింపు పొందిన విక్రమ్ సిరికొండ, గతంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో దర్శకుడిగా మారినప్పటికీ, ఆ చిత్రం విజయం సాధించలేదు.
Also Read: Mass Jathara: మాస్ జాతర గ్రాండ్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Varun Tej: ఇప్పుడు ఆయన రొమాంటిక్ లవ్ స్టోరీతో వరుణ్‌ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు వరుణ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, మరో ఫ్లాప్ డైరెక్టర్‌తో జతకట్టడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ఈ రిస్క్‌తో విజయం సాధిస్తాడా లేక మరోసారి నిరాశపరుస్తాడా అనేది చూడాలి.