Crime News: ఆన్‌లైన్ బెట్టింగ్ వలయంలో చిక్కుకున్న ఎందరో యువత తనువులు చాలించారు. మరెందరో డబ్బుల కోసం తమ అనుకున్నవారినే కడతేర్చేదాకా తెగించారు. మరెన్నో కుటుంబాలు ఆ బెట్టింగ్ రక్కసికి బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు ఉన్న ఆస్తిపాస్తులను పోగొట్టుకొని కట్టుబట్టలతో మిగిలి కుమిలిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జాఢ్యం ఇంకా వదలడం లేదు. తాజాగా ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపైనే కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.
Crime News: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవభూమయ్య (62) అనే వ్యక్తి తన కుమారు నవీన్ (33)తో కలిసి నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా నవీన్ మద్యం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారాడు. నవీన్ నిత్యం డబ్బులు పోగొట్టుకుంటున్న విషయం తండ్రికి తెలిసి మందలించాడు. అయినా అతనిలో మార్పు రావడం లేదు.
Crime News: డబ్బులు కావాలంటూ నిత్యం తండ్రిని వేధించే వాడు. కన్నపాపానికి అంతో ఇంతో ఇస్తూ వస్తున్నాడు ఆ తండ్రి. ఇదే సమయంలో నిన్న మళ్లీ డబ్బులు కావాలని తండ్రితో గొడవకు దిగాడు. డబ్బుల్లేవని కొడుకుకు తండ్రి చెప్పడంతో ఆ వ్యసనంలో నవీన్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఏకంగా కత్తితో తండ్రిపైనే దాడికి దిగాడు.
Crime News: ఈ సమయంలో తండ్రీ, కొడుకులు ఇద్దరూ పెనుగులాడారు. దీంతో ఇద్దరికీ కత్తిగాట్లు అయి గాయాలయ్యాయి. ఇక లాభం లేదనుకున్న తండ్రి తన కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: కాయకష్టం చేసి వస్తున్న కన్నతండ్రికి సుఖం లేకుండా చేసిన ఆ కొడుకు.. ఏకంగా చంపేందుకే యత్నించాడు. అంటే ఆ బెట్టింగ్ మాయాజాలం తన అనుకున్న వారిని కూడా మట్టుబెట్టాలని చూస్తున్నదన్నమాట. ఇలాంటి జాఢ్యం వీడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.