Varun Tej

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త లవ్ స్టోరీ..?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందనున్న ఈ లవ్ స్టోరీ షూటింగ్ డిసెంబర్‌లో మొదలవనుంది. ఈ సినిమా ఆయనకు బూస్ట్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: Jatadhara: జటాధర ట్రైలర్ సంచలనం.. బజ్ మారింది!

వరుణ్ తేజ్ ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ, కొత్త ప్రాజెక్ట్‌లతో తిరిగి ఫామ్‌లోకి రావడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన “కొరియన్ కనకరాజు” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ చివరిలోపు పూర్తవనుంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తాజాగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గత ఏడాది ఫైనల్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది అమెరికాలో కీలక షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ లవ్ స్టోరీ వరుణ్ తేజ్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆయనకు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *