Varun Tej – Lavanya: టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరుపొందిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కుమారుడికి పేరు పెట్టి, ఆ ఆనందాన్ని పంచుకున్నారు. గత నెలలో ఈ జంటకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా జరిగిన బారసాల వేడుకలో, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే బాబుకు “వాయువ్ తేజ్ కొణిదెల” అని నామకరణం చేశారు.
ఈ సంతోషకరమైన వార్తను వరుణ్, లావణ్య సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వారు తమ ముద్దుల బాబుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అవి అభిమానుల్లో వైరల్ అయ్యాయి. తమ వారసుడి రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం నిండిపోయింది. అంతేకాకుండా, ఇటీవలే అల్లు శిరీష్ తన నిశ్చితార్థాన్ని నయనికతో ప్రకటించడం, ఇప్పుడు వాయువ్ తేజ్ రాక.. ఈ రెండు శుభ సంఘటనలు మెగా, అల్లు కుటుంబాలలో ఆనందాన్ని రెట్టింపు చేశాయి.
Also Read: Mana Shankara VaraPrasad Garu: మన శంకర వరప్రసాద్‌గారు సాంగ్ ప్రోమో రిలీజ్
కొణిదెల నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్, తక్కువ కాలంలోనే మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన, లావణ్య త్రిపాఠి 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్లో మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త సంతోషం ఆయన కెరీర్‌కు కూడా కలిసి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా కుటుంబ సభ్యులందరూ బాబుతో ఉన్న క్యూట్ మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.