Keerthy Suresh: అట్టీ సమర్పణలో తెరకెక్కుతున్న ‘తేరీ’ హిందీ రీమేక్ ‘బేబీ జాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ‘మహానటి’ కీర్తి సురేశ్. ఈ జాతీయ ఉత్తమ నటి ఇప్పటి వరకూ తనకున్న ఇమేజ్ ను చెరిపేసే ప్రయత్నంలో పడినట్టుగా అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ‘బేబీ జాన్’లోని పాట చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇప్పటి వరకూ కీర్తి సురేశ్ ఓ పద్థతైన పాత్రలను చేస్తూ వచ్చింది. గ్లామర్ ట్రీట్ చేసినా… ఎక్కడా అసభ్యకరమైన దుస్తులు ధరించడం కానీ స్టెప్పులు వేయడం గానీ చేయలేదు. కానీ లేటెస్ట్ సాంగ్ లో మాత్రం…. తన ఇమేజ్ కు భిన్నమైన డ్రస్సింగ్ స్టైల్ తో కుర్రకారుని కిర్రెక్కించింది. ఈ పాటలోని కొన్ని స్టెప్స్ చూస్తే… తాను అందాల ఆరబోతకు సిద్థమని చెప్పకనే చెబుతోందనే అభిప్రాయమూ కలుగుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతోంది.
