Serial Killer Arrested

Serial Killer Arrested: 19 మందిని అత్యాచారం చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

Serial Killer Arrested: ఖాకీ సినిమాలో సీరియల్ కిల్లర్లను అరెస్ట్ చేసేందుకు హీరో కార్తీ ఎన్ని తిప్పలు పడతాడో మనం వెండితెర మీద చూశాం. అదే సినిమా తరహాలోనే ఓ కిల్లర్ ను పట్టుకొనేందుకు గుజరాత్ పోలీసులు అదే తరహాలో, నిందితుడి ముఖచిత్రం పట్టుకొని తిరగని సిటీ లేదు.. గ్రామం లేదు. కానీ ఖాకీ సినిమాలో ఓ జైలర్ ఏవిధంగా నిందితుల జాడ కనుగొని సమాచారం అందిస్తాడో, అదే తరహాలో ఓ జైలర్ గుజరాత్ పోలీసులకు కిల్లర్ ఆచూకీ తెలిపి సహకరించాడు.

రైల్వే స్టేషన్లే అతని స్థావరాలు. ఒంటరి మహిళ కనిపించిందా ఇక అంతే. అరెస్ట్ కావడానికి ముందు కూడా మహిళను హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్. అది కూడా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోనే.. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. దోచుకోవడం.. హతమార్చడం ఇతని నైజం. నాలుగు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి, గడగడ లాడిస్తున్న సీరియల్ కిల్లర్ ను గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Serial Killer Arrested: నవంబర్ 14న వుద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో, పట్టాలపై బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన రాహుల్ జాట్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. రాహుల్ ను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.

రాహుల్ జాట్ ఒకచోట దోపిడీకి పాల్పడి హత్య చేస్తే మరో చోటికి తన స్థావరం మార్చడం అలవాటుగా మార్చుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేస్టేషన్ల వద్దగల ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడినట్లు ఎస్పీ కరణ రాజ్ వాఘేలా తెలిపారు. నిందితుడి పై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో అధికంగా కేసులు నమోదై ఉన్నాయని, ఇతను దోపిడీ చేసి హత్యలు చేయడమే అలవాటుగా మార్చుకొని, ఏకంగా 19 మందిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shubman Gill: యశస్వితో జోడీకి గిల్ తగడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *