Breaking News: వైసిపి సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప తాలూకా పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో వారం రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు విచారణకు వచ్చిన వర్రా రవీంద్ర రెడ్డి తృటిలో తప్పించుకొని పరారయ్యాడు.వారం నుంచి నాలుగు బృందాలను ఏర్పాటు చేసి వర్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే నిన్న సాయంత్రం వర్రా ను పోలీసులు అదుపులోకి సికె దిన్నె పోలీసు స్టేషన్ లో ఉంచినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సికె దిన్నె పోలీసు స్టేషన్ వద్ద పోలీసుల భారీగా మొహరించారు.వర్రా ను ఈ రోజు కడప కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.