సినిమాలకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచారు తమిళ నటి వనిత విజయకుమార్ . ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది వనిత. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.
అయితే దీనిపై వనిత తాజాగా క్లారిటీ ఇచ్చింది. అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు నెటిజన్లు వనితపై మండి పడుతున్నారు.
కాగా 1995లో తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. వనిత తమిళ నటుడు విజయకుమార్, మంజుల యొక్క పెద్ద కుమార్తె . వనితకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్‌లో పాల్గొంది.