Jorich Van Schalkwyk: అండర్-19 క్రికెట్ చరిత్రలో (పురుషుల యూత్ వన్డేలలో) తొలి డబుల్ సెంచరీని ఇటీవల జోరిచ్ వాన్ స్చాక్‌విక్ (Jorich Van Schalkwyk) సాధించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు చెందిన ఈ 18 ఏళ్ల బ్యాటర్, జులై 25, 2025న జింబాబ్వేతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ మ్యాచ్‌లో 215 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అతను శ్రీలంకకు చెందిన హసితా బోయగోడా పేరిట ఉన్న 191 పరుగుల రికార్డును అధిగమించాడు.
హరారేలోని సన్‌రైజర్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 385 పరుగులు చేసింది. జోరిచ్ వాన్ స్చాక్‌విక్ 215 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన జోరిచ్ 153 బంతుల్లో 19 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేసి 47వ ఓవర్‌లో ఔటయ్యాడు.
ఇది కూడా చదవండి: Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్
యూత్ వన్డేల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. అంతకుముందు, 2018 అండర్-19 ప్రపంచ కప్‌లో శ్రీలంకకు చెందిన హసిత బోయగోడ నెలకొల్పిన 191 పరుగుల ప్రపంచ రికార్డును అతను అధిగమించాడు.
అండర్-19 వన్డేల్లో టాప్ 5 అత్యధిక స్కోరర్లను పరిశీలిస్తే, జోరిచ్ వాన్ స్చాక్‌విక్ 215, హసిత బోయగోడ 191, న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ బులా 180, ఆస్ట్రేలియాకు చెందిన థియో పాల్ డోరోపౌలోస్ 179 నాటౌట్, భారత్ కు చెందిన అంబటి రాయుడు 177 నాటౌట్ పరుగులు చేశారు.

