Droupadi Murmu:భారతదేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది అసాధారణ నాయకత్వమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్‌కర్ కొనియాడారు. గురువారం వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్‌లోని పటేల్ విగ్రహం వద్ద వారు ఘన నివాళులర్పించారు. పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Droupadi Murmu:భారత దేశ ఉక్కు మనిషిగా ప్రజల చేత పిలిపించుకున్న పటేల్ దేశ ప్రజల్లో సంఘీభావ స్ఫూర్తిని నింపారని తెలిపారు. దేశంలో విభిన్న రాచరిక ప్రాంతాలను ఒకే దేశంగా ఏకం చేయడానికి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. 1875లో గుజరాత్ నాడియాడ్‌లో జన్మించిన పటేల్ మనదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయనను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.