Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాద దాతలకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు తాజాగా శుభవార్తను అందించింది. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించవచ్చని టీటీడీ తెలిపింది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు అన్నప్రసాద వితరణలో పాల్గొనవచ్చని పేర్కొన్నది.