Warangal: వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో ఓ చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్, ఇతరులు అతని ఒంటిపై నీరు చల్లి వారించారు. అయినా అతను తనకు జరిగిన అన్యాయాన్ని స్టేషన్ ఎదుట ప్రశ్నల వర్షం కురిపించాడు.
Warangal: మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న శ్రీధర్.. గత అర్ధరాత్రి దాటాక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. తాను చనిపోతానంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తనను ఎస్ఐ విఠల్ నెలరోజుల నుంచి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోతే ఎస్ఐ విఠల్‌యే కారణమని చెప్పాడు. వెంటనే అతని చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను పోలీస్ సిబ్బంది లాక్కొని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను అక్కడున్న వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.