Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ జైల్లోనే

Vallabhaneni Vamsi: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరైంది. సీఐడీ కోర్టు ఈరోజు (శుక్రవారం) వంశీకి బెయిల్ మంజూరు చేసినా, ఆయన మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం – వంశీపై మిగతా కేసులపై ఇంకా కోర్టుల విచారణ కొనసాగుతోంది.

ఇటీవలి కాలంలో వంశీకి వరుసగా రెండు కేసుల్లో బెయిల్ లభించింది. ఒకటి – సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, రెండోది – టీడీపీ కార్యాలయంపై దాడి కేసు. అయితే, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు ఆయనపై రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనతో పాటు అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. వంశీకి మే 29 వరకు రిమాండ్ విధించగా, మోహన్‌కు 14 రోజుల రిమాండ్ వేసింది.

అంతే కాకుండా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీపై పీటీ వారెంట్‌కి కూడా నూజివీడు కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో వంశీ ప్రస్తుతం జైల్లోనే ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు.

Also Read: Short News: రేపు మోదీతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ

Vallabhaneni Vamsi: ఇంకా తాజా ఆరోపణల ప్రకారం, వంశీ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో తాజాగా మరో కేసు నమోదైంది. వంశీ, ఆయన అనుచరులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

వంశీ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని ఆయన తరఫున లాయర్ కోర్టులో విన్నవించగా, కోర్టు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వంశీపై ఉన్న వివిధ కేసుల విచారణతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా కొనసాగనున్నాయి. ఈ పరిణామాల వల్ల, వంశీకి కొన్ని కేసుల్లో బెయిల్ లభించినా, తాత్కాలికంగా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *