V Hanumantha Rao: బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో అపశృతి చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నేతలు, ఇతర బీసీ నేతలు ర్యాలీ తీస్తుండగా, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు రోడ్డుపై బోర్లాపడిన ఘటన చోటుచేసుకన్నది. వెంటనే తోటి నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. బ్యానర్ ముందుగా ఉంచి ప్రదర్శన నిర్వహిస్తుండగా, ఆ బ్యానర్ వీహెచ్ కాళ్లకు తగిలింది. దీంతో ఆయన ముందువైపునకు రోడ్డుపై బోర్లా పడిపోయారు. దీంతో ఆయన నుదుటికి, పొట్టభాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం వీహెచ్ క్షేమంగానే ఉన్నారు.
