New Ration Cards: తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్‌కార్డుల జారీపై ప్రజల్లో ఆందోళన పదలిసిన అవసరం లేదు అని చెప్పారు. కావాలనే కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారు అని అయన మండిపడ్డారు. గ్రామసభలు ముగిసినా తర్వాత అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి, గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గుర్తుచేశారు. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి: Jansena: జనసేన మరో అధ్యాయం.. గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ నిర్ణయం
New Ration Cards: ఇదిలా ఉండగా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ జనవరి 26 నుండి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చారు. రైతు భరోసా విషయంలోనూ కొందరు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో భూమిలేని పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఎటువంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని భట్టి చెప్పారు.