Jansena: ఎన్నికల్లో నూరుశాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశంలోనే చారిత్రక విజయంతో రాజకీయ చరిత్రలో పెను సంచలనం సృష్టించిన జనసేన పార్టీ ఖాతాలో మరో గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చడంతో మరో అధ్యాయానికి నాంది పడింది. దీంతో దశాబ్దకాలం పోరాటానికి మరింత గుర్తింపు వచ్చినట్టయింది.కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు లేఖ రాసింది. దీంతో జనసేన రకగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొంది, గాజు గ్లాస్‌ను రిజర్వ్ గుర్తుగా చేసుకున్నది.
Jansena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ సీట్లలో నూరుశాతం సీట్లను గెలుపొందడంతో దేశంలోనే జనసేన పార్టీకి గుర్తింపు దక్కినట్టయింది. ఒక్కసారిగా జాతీయ రాజీకాయాలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైపు చూశాయి. ప్రధాని మోదీ సహా ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పవన్ కల్యాణ్‌కు ఆనాడే ప్రశంసల వర్షం కురిపించారు.
Jansena: సినీ నటుడిగా కోట్లాది మంది అభిమాన గణాన్ని కలిగి ఉన్న పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ఆనాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు పవన్ కల్యాణ్ అలుపెరగని పోరాటం చేశారు. ప్రజలకు నీతివంతమైన పాలన జరగాలని కోరుకుంటూ వచ్చారు. ప్రజల ఈతి బాధలు తన బాధలుగా ప్రజాగళం వినిపిస్తూ వచ్చారు.
Jansena: గత ఎన్నికల్లో జనసేనకు ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డారు. ఓటమి పాలైనా వాటినే విజయ సోపానాలుగా పేర్చుకున్నారు. ఒకవైపు పాలకులపై పోరాడుతూ, మరోవైపు ప్రజల్లో చైతన్యం తెస్తూ వచ్చారు. ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు. సుపరిపాలన అందిస్తానని నమ్మకం కలిగించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తానున్నానంటూ అక్కడే వాలిపోయి వారి పక్షాన పోరాడుతూ వచ్చారు.
Jansena: ప్రజల ఈతిబాధలు పోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దన్న భావనతో పవన్ కల్యాణ్ ఎంతో పరిణతి ప్రదర్శించారు. టీడీపీ, బీజేపీని కూటమికి ఒప్పించారు. తన పార్టీకి సీట్లను తగ్గించుకొని క్యాడర్‌ను మెప్పించారు. మూడు పార్టీలతో ఏర్పడిన కూటమిని జనంలోకి తీసుకెళ్లడంలో, జనాన్ని ఒప్పించడంలో సఫలీకృతుడయ్యాడు. దీంతో జనం మెచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించారు.
Jansena: కూటమి ధర్మంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనామోదం పొందారు. ఇప్పటికీ సినిమాలకు తర్వాత ప్రాధాన్యం ఇస్తూ, గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ వస్తున్నారు పవన్‌కల్యాణ్. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పథకాలకు నిధులను రప్పిస్తూ ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకుంటూ పవన్‌కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈ దశలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపును ఇవ్వడంతో ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నిండుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేండ్ల పోరాటానికి మరో గుర్తింపు దక్కిందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.