Uttam Kumar: రాష్ట్ర కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, “మంత్రుల మధ్య పూర్తి సమన్వయం ఉంది. విభేదాలు లేవు. నేను నా శాఖ, నా జిల్లా అభివృద్ధి పనులపైనే ఫోకస్ చేస్తున్నాను” అని తెలిపారు.ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలపై స్పందించిన ఆయన, “అవి పూర్తిగా అవాస్తవం. బదిలీలు కూడా నిబంధనల ప్రకారం జరిగాయి. మొత్తం ప్రాసెస్‌ను నేనే దగ్గరుండి పర్యవేక్షించాను” అని స్పష్టం చేశారు.
నీటి వాటాల అంశంపై మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు > “తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఉన్నా – మా హక్కులను వదులుకోం. బనకచర్ల, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయంలో మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నాం” అని వివరించారు.
అలాగే మాజీ సీఎం కేసీఆర్ పాలనపై వ్యాఖ్యానిస్తూ –
> “కేసీఆర్ పదేళ్ల పాలనలో పెద్దగా పనేమీ జరగలేదు. కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. అయినా కాళేశ్వరం నీళ్లు లేకపోయినా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయి” అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర పర్యటనపై మాట్లాడుతూ త్వరలోనే అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు.
రైతుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ₹25 వేల కోట్లు కేటాయించినట్లు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.