White House: అమెరికాలో విద్యార్థి రుణాల భారంతో సతమతమవుతున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఉపశమనం కల్పించే దిశగా వైట్‌హౌస్ మరో ముందడుగు వేసింది. వివిధ పథకాల ద్వారా, సాంకేతిక లోపాల సవరణల ద్వారా ఇప్పటికే మిలియన్ల మంది విద్యార్థులకు రుణ మాఫీని మంజూరు చేసింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా, కొన్ని నిర్దిష్ట వర్గాల రుణగ్రహీతలకు మాఫీని వేగవంతం చేస్తూ, యు.ఎస్. విద్యాశాఖ ఇటీవల కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.తాజా ప్రకటనలు గతంలో ఉన్న కొన్ని పథకాల అమలు, విస్తరణకు సంబంధించినవి. ఇవి ముఖ్యంగా ఈ కింది మూడు వర్గాల వారికి మాఫీని అందిస్తున్నాయి:
1. ఆదాయ ఆధారిత చెల్లింపు పథకాలు
విద్యార్థులు తమ ఆదాయ స్థాయిని బట్టి నెలవారీ వాయిదాలు (EMI) చెల్లించే పథకాలివి. 20 నుంచి 25 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చెల్లింపులు చేసిన తర్వాత, మిగిలిన రుణాన్ని మాఫీ చేస్తారు. గతంలో ఈ పథకాల అమలులో జరిగిన సాంకేతిక లోపాల కారణంగా చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఆ లోపాలను సవరించి, అర్హత ఉన్న వారికి కోట్లాది డాలర్ల రుణాలను మాఫీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కొత్త ఒప్పందం ప్రకారం, 2025లో అర్హత పొందిన IDR రుణగ్రహీతలకు మాఫీ అయిన రుణాలపై కేంద్ర పన్ను వర్తించదు. ఇది వారికి ఆర్థికంగా పెద్ద ఊరట.
Also Read: Rahul Gandhi: రాహుల్‌గాంధీ పెళ్లి ముచ్చట.. దీపావళి వేళ స్వీట్స్ షాపులో ఆసక్తికర సంఘటన!
2. ప్రభుత్వ సేవ రుణ మాఫీ
ప్రభుత్వ సంస్థలు, 501(c)(3) లాభాపేక్ష లేని సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు.ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న వారు 10 ఏళ్లపాటు (120 నెలల చెల్లింపులు) ప్రభుత్వ సేవలో పనిచేసిన తర్వాత మిగిలిన రుణాన్ని మాఫీ చేస్తారు. ఇటీవల కాలంలో, అర్హత ప్రమాణాలను సడలించడం, గతంలో జరిగిన పొరపాట్లను సవరించడం ద్వారా లక్షల మంది ఈ మాఫీని అందుకున్నారు.
3. నిర్దిష్ట వర్గాల వారికి మాఫీ
ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న కొన్ని ప్రత్యేక సమూహాలకు కూడా మాఫీని మంజూరు చేస్తోంది. పూర్తి లేదా శాశ్వత వైకల్యం ఉన్న వారికి అర్హత మేరకు రుణాలు రద్దు చేయబడుతున్నాయి. విద్యార్థులను మోసం చేసినట్లు లేదా తప్పుదారి పట్టించినట్లు తేలిన కాలేజీలు, విద్యాసంస్థల ద్వారా రుణాలు తీసుకున్న వారికి కూడా ‘బోర్రోవర్ డిఫెన్స్’ కింద రుణాలను మాఫీ చేస్తున్నారు.