Donald Trump: చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నాలుగు వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. సోయాబీన్ ఎగుమతులపైనే చైనా అధినేతతో ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు ట్రూట్ లో పోస్టుచేశారు. సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చైనాపై విధిస్తున్న సుంకాల్లో కొంతమొత్తం సోయాబీన్ రైతులకు అందిస్తామన్నారు. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో భాగంగా.. ఈ భేటీ ఉంటుందని భావిస్తున్నారు.ఈ ఏడాది ఆరంభంలో చైనాపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించింది. అటు చైనా కూడా ప్రతికార సుంకాలతో మోత మోగించడంతో… ఇరుదేశాల మధ్య వాణిజ్యయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత చర్చలతో కాస్త వెనక్కి తగ్గినా.. సందర్భం దొరికినప్పుడల్లా బీజింగ్ పై ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్, చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ఇటీవల ఈయూ, నాటో దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు.
ఇది కూడా చదవండి:Rain Alert: తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్..
మరోవైపు ఏడు యుద్ధాలను ఆపినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాకు పెద్ద అవమానమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. గాజాలో యుద్ధం ముగింపునకు ఇజ్రాయెల్ అంగీకరించిందని హమాస్ అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. తాము ప్రతిపాదించిన శాంతి ఫార్ములాకు ఒప్పుకోకపోతే… హమాస్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాజా వివాదాన్ని అంతంచేయడానికి… గత నెల 29న ప్రకటించిన శాంతి ప్రణాళిక విజయవంతమైతే తాను 8 యుద్ధాలను ఆపినట్లుఅవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. నోబెల్ తనకు వద్దని….. అమెరికాకు కావాలని వివరించారు. గాజా వివాదం ముగిస్తే…… తనకు నోబెల్ బహుమతి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.