Israel Gaza War: రెండేళ్ల క్రితం గాజాపై సైనిక చర్యను మెుదలుపెట్టిన ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యం ఇప్పటి వరకు సైనిక సాయం కింద 21.7 బిలియన్ డాలర్లు అందజేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. అమెరికా సాయం లేకుండా హమాస్ పై ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు దాడులు చేసే పరిస్థితిలో ఉండేదని కాదని అభిప్రాయపడింది. అటు ఈజిప్టులో ఇజ్రాయెల్ -హమాస్ మధ్య పరోక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. హమాస్ తో యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
ఈ మొత్తాన్ని ఏదో ఒక్క రోజు లేదా ఒక్కసారి ప్రకటించిన సాయంగా కాకుండా, 2023 అక్టోబర్ 7న గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి (దాదాపు రెండు సంవత్సరాలలో) అమెరికా ఇజ్రాయెల్‌కు అందించిన మొత్తం సైనిక సహాయంగా ఒక విద్యా సంస్థ అధ్యయనం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: మంత్రులు అడ్లూరి, పొన్నం వివాదం సమసినట్టేనా? అడ్లూరిపై వ్యాఖ్యలకు పొన్నం క్లారిటీ
ఈ నివేదిక ప్రకారం, అమెరికా అందించిన ఈ భారీ సాయం లేకుండా ఇజ్రాయెల్ గాజాలో తన సైనిక కార్యకలాపాలను ఇంత విస్తృతంగా నిర్వహించడం సాధ్యమయ్యేది కాదు. ఇజ్రాయెల్ ఉపయోగించే పోరాట విమానాలు, హెలికాప్టర్లు, బాంబులు, క్షిపణులు మరియు విడిభాగాల సరఫరా ఎక్కువగా అమెరికా నుండే వస్తున్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం వల్ల గాజాపట్టీలో జరిగిన విధ్వంసం మాటలకందనిది. 21 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను ఈ యుద్ధం ఎంతలా దెబ్బతీసిందో, 365 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఎంతలా నాశనం చేసిందో అర్థం చేసుకోవడానికి కొన్ని గణాంకాలు మనకు సాయపడతాయి. ఈ భూమి మీద అత్యంత వినాశకర ప్రాంతాల్లో ఒకటిగా గాజా తయారైంది. యుద్ధానికి ముందు గాజాలో ఉన్న 21లక్షల మంది జనాభాలో ఏకంగా 11 శాతం చనిపోవడమో, గాయపడటమో జరిగింది. పలు పట్టణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రతి 10 భవనాల్లో 8 ధ్వంసమయ్యాయి.