US Gay Couple: అమెరికాలోని జార్జియా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. స్వలింగ సంపర్క జంటకు ఇక్కడి కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాదు, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పెరోల్ మంజూరు చేయలేమని న్యాయమూర్తి చెప్పడంతో ఇద్దరూ ఇప్పుడు తమ జీవితాంతం కటకటాల వెనుక గడపనున్నారు. అంతెందుకు ఇంత కఠోరమైన శిక్ష వేయడానికి కారణం తెలిస్తే మీ రక్తం ఉడికిపోవడం ఖాయం.
స్వలింగ సంపర్కులైన 34 ఏళ్ల విలియం, 36 ఏళ్ల జకరీ జులక్ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత, ఆ జంట 12 మరియు 10 ఏళ్ల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని, వారిని లైంగికంగా దోపిడీ చేశారు. అంతే కాదు నేరగాళ్లు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను రికార్డు చేసి స్నేహితులకు విక్రయిస్తున్నారు.
US Gay Couple: వాల్టన్ కౌంటీ పోలీసులు స్వలింగ సంపర్కుల ఇంటిపై దాడి చేశారు, విచారణలో వారు కనుగొన్న ఫుటేజీని చూసి అధికారులు షాక్ అయ్యారు. నివేదిక ప్రకారం, స్వలింగ సంపర్కుల ఇంటి నుండి 7TB కంటే ఎక్కువ డిజిటల్ డేటా, గ్రాఫిక్ ఫోటోలు, అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక నుంచి నిరుపేద పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. తమ ఇద్దరు అనాథ పిల్లలను భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసి . . వారిని తప్పుడు విధానంలో వాడుకున్నందుకు స్వలింగ సంపర్కులైన జంటకు కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది.