US Elections 2024

US Elections 2024: యూఎస్ ఎన్నికలు.. ట్రంప్ జోరు.. కమల వెనుకబాట..

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి. వీటిలో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ 17 చోట్ల, డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ 8 చోట్ల విజయం సాధించారు.

ఇప్పటి వరకు ఓటింగ్‌లో పెద్దగా మార్పు లేదు. డెమొక్రాట్లకు అనుకూలమైన బ్లూ స్టేట్స్ లో కమలా హారిస్ విజయాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీకి విధేయ రెడ్ స్టేట్స్ లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తున్నారు. 7 స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు వచ్చే వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు ఏమిటి అనేది తెలియదు. 

US Elections 2024: భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల సమయం వరకూ ఉన్న పరిస్థితి ఇది. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉంది. 538 ఎలక్టోరల్ ఓట్లకు అంటే అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని సీట్లకు మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం దాదాపు 9:30 గంటలకు అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ముగియనుంది.

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం  అధ్యక్ష ఎన్నికలతో పాటు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ మధ్య అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. కమల గెలిస్తే 230 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అమెరికాకు ఓ మహిళా ప్రెసిడెంట్ గా రికార్డ్ సృష్టిస్తారు. ట్రంప్ గెలిస్తే నాలుగేళ్ల తర్వాత మళ్లీ వైట్‌హౌస్‌కు చేరుకుంటారు. కమలా హారిస్ ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉండగా, ట్రంప్ 2017 నుండి 2021 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.

ట్రంప్ ఆధిక్యంలో ఉన్నది ఇక్కడే . .

నార్త్ డకోటా,వయో మింగ్,సౌత్ డకోటా,నెబ్రాస్కా,ఒక్లాహోమా,టెక్సాస్,ఆర్కాన్స్, లుసియాన,ఇండియానా, టెన్నేసి, కేంటకి,మిస్సోరి,మిసిసిపి,ఒహాయో,వెస్ట్ వర్జీనియా,అలబామా, సౌత్ కరోలినా,ఫ్లోరిడా రాష్ట్రాల్లో రిపబ్లిక్ పార్టీ ఆధిక్యం

9 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించిన కమలా హరిస్ డెమోక్రటిక్ పార్టీ

ఇలినోయి,న్యూజెర్సీ,మేరీ ల్యాండ్,వర్మాంట్,న్యూయార్క్,కనెక్టికట్,డేలవేర్,మసాచుసెట్స్,రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో 99 సీట్లు గెలుచుకున్న డెమోక్రటిక్ పార్టీ

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tollywood: సందీప్ రెడ్డి వంగా‌కు రామ్ చరణ్, ఉపాసన నుంచి ఊహించని కానుక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *