Urvil Patel: భారత్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ‘టీ20’ సిరీస్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ 28 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్, త్రిపుర జట్లు తలపడ్డాయి. గుజరాత్ ‘టాస్’ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
శ్రీధమ్ (57) అర్ధ సెంచరీతో త్రిపురకు సహకరించాడు. కెప్టెన్ మన్ దీప్ సింగ్ (7) త్వరగా అవుట్ కాగా.. శ్రీనివాస్ శరత్ (29), అభిజిత్ (15) కాస్త సహకరించారు. దీంతో త్రిపుర 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది.
గుజరాత్ జట్టులో ఆర్య దేశాయ్, ఉర్విల్ పటేల్ మెరుపు వేగంతో పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపించిన ఉర్వివ్ తానాడిన 28వ బంతికి తన సెంచరీని సాధించాడు.
తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలో 150 పరుగులు జోడించిన తర్వాత ఆర్య (38) ఔటయ్యాడు. అనంతరం గుజరాత్ 10.2 ఓవర్లలో 156/2 స్కోరు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉర్విల్ (35 బంతుల్లో 113 పరుగులు, 12×6, 7×4), ఉమంగ్ (1) నాటౌట్‌గా నిలిచారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ లో జరగడం కష్టమే! వేదిక మారుతుందా?
మొదటి భారతీయుడు
భారత ‘టీ20’ అరేనాలో (28 బంతుల్లో) అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ నిలిచాడు.హిమాచల్ ప్రదేశ్ పై 2018లో రిషబ్ పంత్ 32 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పటివరకూ రికార్డ్ గా ఉంది.
* ఓవరాల్‌గా టీ20ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ (సైప్రస్ పై , 2024లో ) 27 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో ఉన్నాడు.
* ‘టాప్-4’ సెంచరీలు..
ఆటగాడు/జట్టు ప్రత్యర్థి సంవత్సరం బంతులు
సాహిల్/ఎస్టోనియా సైప్రస్ 2024 27
ఉర్విల్/గుజరాత్ త్రిపుర 2024 28
గేల్/బెంగళూరు పూణె 2013 30
రిషబ్/ ఢిల్లీ EP, 2018 32
ఎవరూ కొనలేదు
ఉర్విల్ పటేల్ (రూ. 20 లక్షలు) IPL (2023)లో గుజరాత్ జట్టులో ఉన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనక్కి వచ్చాడు. తాజా వేలంలో, అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కనిపించాడు. కానీ అతని పేరు వేలంలో కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ నవంబర్‌లో. 27లో అత్యంత వేగంగా ‘టీ20’ సెంచరీ సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.