Delhi: పార్లమెంట్ ఉభయసభల్లో అదానీ అంశం పై చర్చించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడంతో ముందుగా ఉభయసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పునఃప్రారంభమైన తర్వాత కూడా ఉభయసభల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో సభలు రెండు రేపటికి వాయిదాపడ్డాయి.
ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారాలు చేశారు. వాయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా, నాందేడ్ ఎంపీగా రవీంద్ర వసంత్‌రావు చవాన్ ప్రమాణం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు.