Huzurnagar: సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్ పరిధిలోని ఓ గ్రామంలో మహిళలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని, ఎవరూ పట్టించుకోవడం లేదని రోడ్డుపై ట్రాక్టర్లు, ట్రాలీలు, బైక్‌లు అడ్డంగా పెట్టిన గ్రామ మహిళలు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున సిమెంట్ లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.
Huzurnagar: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, రోడ్డుపై ఉండే దుమ్ము తమ ఇండ్లలోకి వస్తుందని, తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని మహిళలు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉన్నా తమ రోడ్లు బాగు కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
Huzurnagar: రోడ్డు పక్కన హోటళ్లు, చిరు వ్యాపారాలు నడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మట్టి లారీలు అడ్డగోలుగా తిరుగుతున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎంతో మంది దుమ్ము కారణంగా జబ్బుల పాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారని ఆందోళన వ్యక్తం చేశారు.