Urvashi Rautela: ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశి రౌతేలా గ్లామర్ బాగానే హైలైట్ అయింది. తాజాగా ఊర్వశి రౌతేలాకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమాలో ఊర్వశి రౌతేలాకి ఛాన్స్ దొరికిందట. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
వచ్చే షెడ్యూల్ లో ఊర్వశి రౌతేలా కూడా షూట్ లో జాయిన్ కానుంది.ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.
Also Read: SSMB 29: లేటెస్ట్ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్!
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో ఊర్వశి కెరీర్ ఇంకెంత ముందుకు వెళుతుందో చూడాలి.