Upendra: దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన కన్నడ స్టార్ ఉపేంద్ర తన తాజా చిత్రం ‘యుఐ’కి రెండు క్లయిమాక్స్ లు ఉంటాయని స్పష్టం చేశారు. జి. మనోహరన్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం 20వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో రెండు క్లయిమాక్స్ ల విషయం తెలియచేస్తూ గ్లోబల్ సినిమాపై టాలీవుడ్ ముద్రను ప్రశంసించాడు.
ఇది కూడా చదవండి: Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ’కి గుమ్మడికాయ కొట్టేశారు
Upendra: తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న అల్లు అరవింద్ కు, తన సినిమాకు కావలసినవన్నీ సమకూర్చిన నిర్మాతలకు కృతజ్జతలు తెలిపాడు. ‘యుఐ’ కథాంశం విభిన్నంగా ఉంటుందని, ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు థ్రిల్ ని ఇస్తుందన్నారు. రేష్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సల్నీలియోన్, సాధుకోకిల, జిషుసేన్ గుప్తా, మురళిశర్మ, నిధి సుబ్బయ్య ఇతర ముఖ్య పాత్రధారులు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.