UP Farmers

UP Farmers: యూపీ రైతుల ఢిల్లీ పాదయాత్ర వాయిదా.. వారం పాటు ఆందోళనలు!

UP Farmers: యూపీ రైతులు తలపెట్టిన ఢిల్లీ పాదయాత్ర వారం రోజులు వాయిదా వేసుకున్నారు. గ్రేటర్ నోయిడా, నోయిడా, యమునా అథారిటీ అధికారులతో రైతు నాయకులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో  నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే నుండి బారికేడింగ్‌లను తొలగించారు. తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి రైతులు వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా దళితుల ప్రేరణ స్థల్ వద్ద రైతులు నిరసనలు తెలుపనున్నారు. వారం రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే రైతులు మళ్లీ ఢిల్లీ బాట పట్టనున్నారు.

అంతకుముందు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ దగ్గర రైతులు గుమిగూడారు. వారు పార్లమెంటును చుట్టుముట్టేందుకు ఢిల్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు. దళిత ప్రేరణ స్థల్ వద్ద పోలీసులు రైతులను అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇది కూడా చదవండి: Raghurama Raju: రఘురామ గుండెల మీద గున్నఏనుగు లాంటి తులసీని కూర్చోబెట్టారు

UP Farmers: రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ-యూపీని కలిపే చిల్లా సరిహద్దుల్లో పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టారు. అయినప్పటికీ, వజ్ర వాహనాలు, RAF సిబ్బందిని మోహరించారు.  డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను ఇరువైపులా మూసివేసి వాహనాలను తనిఖీ చేయడంతో 5 కిలోమీటర్ల మేర జామ్‌ ఏర్పడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: పోలవరాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *