Suresh Gopi: త్రిసూర్ పూరం వద్ద అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు గాను కేంద్ర మంత్రి సురేష్ గోపీపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీపీఐ జిల్లా నాయకుడు సుమేశ్ కేపీ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అయితే, ఉత్సవ వేదిక వద్దకు అంబులెన్స్‌ను వినియోగించడంపై తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని సురేష్ గోపీ గతంలో డిమాండ్ చేశారు. కానీ తర్వాత ఆయన తన డిమాండ్ వెనక్కి తీసుకున్నారు. కొంతమంది గూండాలు తన కారుపై దాడి చేశారని, దాని కారణంగా తన కాలికి గాయమైందని ఆయన చెప్పారు. అందువల్లనే తాను అంబులెన్స్‌లో వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతానని బెదిరించిన మహిళ అరెస్ట్