NRI News: యూఎస్ లో తెలుగు ప్రజలకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వీకెండ్ వినోదాన్ని అందుబాటులోకి తెస్తున్న దేశీ మండీ మరో అద్భుతమైన వినోదాల వీకెండ్ మీకోసం తీసుకురాబోతోంది. సెలబ్రిటీ క్రికెట్ మేళా పేరుతొ అందిస్తున్న ఈ కార్యక్రమంలో మీ కిష్టమైన తెలుగు సెలబ్రిటీలు.. తెలుగు ప్రజలు సినిమా తరువాత అత్యంత ఎక్కువగా ప్రేమించే క్రికెట్ ఆడటానికి రాబోతున్నారు. మీ అభిమాన వెండితెర హీరోలు ఇతర సెలబ్రిటీలు టీములుగా విడిపోయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటారు. మీకు అమితమైన ఉత్సాహాన్ని అందిస్తారు.
యూటీ డల్లాస్ స్టేడియం 800 W క్యాంప్ బెల్ , రీచర్డ్సన్ వేదికగా జూన్ 28 శనివారం ఈ సెలబ్రిటీ క్రికెట్ మేళా నిర్వహిస్తారు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకొక దేశీ మండీ నిర్వాహకులు ఆహ్వానాన్నీ అందించి సగౌరవంగా ఆహ్వానించారు. తెలుగు ప్రజలు అందరూ మిస్ కాకుండా ఈ సెలబ్రిటీ క్రికెట్ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.