Udaya Bhanu

Udaya Bhanu:‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఊపునిచ్చే మాస్ నంబర్ ‘ఇస్కితడి ఉస్కితడి’‌తో అదరగొట్టేసిన ఉదయభాను

Udaya Bhanu: వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను అందరినీ ఆకట్టుకున్నారు. “ఇస్కితడి ఉస్కితడి” అంటూ సాగే ఈ పాటను రఘు రామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట అందులోనూ ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీకి బీ, సీ సెంటర్లు ఊగిపోయేలా ఉన్నాయి. ఇక ఇందులో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

ఇప్పటి వరకు వదిలిన ‘నీ వల్లే నీ వల్లే’, అనగనగా కథలా, బార్బరిక్ థీమ్ సాంగ్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. రిలీజ్‌ కోసం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.

ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను పాత్ర మరింత ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని టీం ప్రకటించనుంది.

Also Read: Anasuya: చెప్పు తెగుద్ది.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..!

తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన , దర్శకత్వం :మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదాల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
డిఓపి : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇంఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజీష్ నంబూరు
లైన్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *