Bengaluru: ఈ మధ్య కాలంలో రాత్రివేళ ఆటోల్లో ప్రయాణం చేయాలంటే మహిళలకు భయం.. ఎందుకంటే ఆ మృగాలు ఏంచేస్తారో అని.. అందుకే ఏమో..తెలియదు కానీ, యువతి పనిచేసే చోట పని నచ్చలేదని..అన్నయ్య నీ దగ్గరకు వస్తా అని చెప్పంది…సారే, చెల్లమ్మ నేను వచ్చి తీసుకెళ్లానని అన్నయ్య చెప్పాడు.. కానీ, మార్గ మధ్యంలో ఇద్దరు ఆటో డ్రైవర్లు అడ్డుకుంటారని పాపం వాళ్లకు తెలియదు.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..?
రాత్రివేళ అన్నయ్యతో కలిసి వెళ్తున్న ఓ యువతిపై బెంగళూరులో ఇద్దరు యువకులు దాడికి తెగించారు. ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం పారిపోతున్న సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read: Crime News: భర్త దాడిలో డ్యాన్సర్ మృతి
నిందితులను ఆటో డ్రైవర్లయిన సయ్యద్ మాన్సూర్, ఆసిఫ్‌లుగా పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన యువతి కేరళలోని ఎర్నాకులంలో నెల రోజులుగా ఉపాధి పొందుతున్నారు.అక్కడ పని నచ్చకపోవడంతో బెంగళూరులోని సోదరునికి ఫోన్ చేసి నీ వద్దకు వచ్చేస్తానని చెప్పారు. కేఆర్‌పురం రైల్వేస్టేషన్‌లో రైలు దిగారు. సోదరునితో కలిసి బైకుపై వెళ్తుతుండగా.. ఆటోలో వచ్చిన నిందితులను వారిని అడ్డగించారు.
తొలుత బాధితురాలి అన్నయ్యపై దాడి చేసి కొట్టారు. యువతిని ఆటోలో అపహరించుకు వెళ్లారు. నిర్జన ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి, స్థానికులకు దొరికిపోయారని వైట్ఫీల్డ్ డీసీపీ శివకుమార్ గుణారె వెల్లడించారు. బాధితురాలు, ఆమె సోదరుడు ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించామన్నారు. మహదేవపుర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

