Suicide

Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!

Suicide: ప్రాణం విలువ తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ప్రతి చిన్న విషయానికి అందరూ ముందు ఎంచుకునే మార్గం సూసైడ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఎవరూ ఆలోచించడం లేదు. ఎందుకు ఇదంతా అంటే.. ఫోన్ రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి. ఇంత చిన్న దానికి కూడా చనిపోతారా అనేలా ఉన్నాయి కారణాలు.

జీడిమెట్ల పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. కిరణ్మయి (26) అనే యువతి కుత్బుల్లాపూర్ ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటుంది. ఆమె 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఈ పెళ్లి ఎంతకాలమో నిలవలేకపోయింది. పెళ్లయిన కొంతకాలానికే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో భర్త నుండి విడిపోయి వేరుగా నివసిస్తోంది. ఈమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కిరణ్మయి కొడుకు ఆమెతోనే ఉంటున్నాడు.

నాలుగేళ్ల క్రితం ఆమె కూకట్‌పల్లిలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఓ కంపెనీలో పనిచేస్తున్న వెంకటేష్ అలియాస్ చందు అనే వ్యక్తితో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఏడాది నుండి ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం కిరణ్మయి ఫోన్‌లో రీఛార్జ్ అయిపోయింది. జీతం ఇంకా రాకపోవడంతో రీఛార్జ్ చేసుకోలేకపోయింది. ఆమె ఫోన్‌లో రీఛార్జ్ అయిపోయింది అని తెలిసి కూడా చందు రీఛార్జ్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మరణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటున్నారు. కిరణ్మయి తల్లి మాత్రం చందుపైనే అనుమానం ఉందని ఆరోపణలు చేస్తోంది.

ఇలాంటి చిన్న విషయాలకు కూడా ప్రాణం తీసుకోవడం ఏంటని నెటిజన్లు అంటున్నారు. రీఛార్జ్ రెండు రోజులు లేకపోతే పోయేది ఏముంది? ఇది రీఛార్జ్ చేయకపోవడం వల్ల కాదు, తనకి ఫోన్‌లో రీఛార్జ్ లేదని తెలిసినా చందు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల జరిగిన విషయం. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఎక్కువగా ఆలోచించడం వల్ల జరిగే పరిణామాలు ఇవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *