Elephant Attack

Elephant Attack: అడవి ఏనుగు బీభత్సం.. ఒకరి మృతి!

Elephant Attack: ఒక అడవి ఏనుగు ఓ వృద్ధుడిని తొక్కి చంపేసింది. కాఫీతోటల మధ్యలో అలా తొక్కడంతో మృతదేహం కాఫీ ప్లాంట్స్ కింద నలిగిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హస్సన్ కాఫీ ప్లాంటేషన్ లో జరిగింది. కర్ణాటక ఆలూరు ఆదిబైలు గ్రామానికి చెందిన హసన్ (78) పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లి సాయంత్రం సమయంలో తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాఫీ తోట మధ్య నుంచి వెళుతుండగా ఎదురుగా వచ్చిన అడవి ఏనుగు వృద్ధుడిపై దాడి చేసి తొక్కి చంపేసింది. శరీరాన్ని కాఫీ మొక్కలతో కప్పి వెళ్ళిపోయింది.

రాత్రి పొద్దుపోయే వరకు పుట్టయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. నిన్న ఉదయం కాఫీ తోటలో అతని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.

ఈ గ్రామం చాలా కాలంగా అడవి ఏనుగుల బీభత్సంతో ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ కాఫీ మొక్కలను అడవి ఏనుగులు తొక్కి నాశనం చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు వృద్ధుడిని ఏనుగు చంపేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖాధికారులు ఏనుగుల బెడదను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Jalgaon Train Accident: వదంతులతో పుట్టిన కంగారు.. 12 మంది ప్రాణాలు తీసింది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Reels: నిరంతరం రీల్స్ చూస్తున్నారా? అధిక రక్తపోటు రావచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *