Indian Army Record: ఇండియన్ ఆర్మీకి చెందిన మోటార్‌సైకిల్ స్టంట్ టీమ్ అత్యంత ఎత్తైన మానవ పిరమిడ్‌ను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ అత్యంత ఎత్తైన మానవ పిరమిడ్‌ను రూపొందించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ పిరమిడ్ నిర్మాణం, 20.4 అడుగుల ఎత్తు ఉంది. 7 మోటార్ సైకిళ్లపై 40 మంది పురుషులు దీనిలో ఉన్నారు. విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు డ్యూటీలో 2 కిలోమీటర్ల దూరం వేరు ప్రయాణించారు. “డేర్‌డెవిల్స్” అని పిలువబడే మోటార్‌సైకిల్ రైడర్ డిస్‌ప్లే టీమ్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ నుండి వచ్చింది. అనేక ప్రశంసలను పొందుతూ వస్తోంది. ఈ జట్టు మొత్తం 33 ప్రపంచ రికార్డులను ఇప్పటివరకూ సృష్టించింది.
WORLD RECORD ALERT …
The Indian Army achieves the highest human pyramid on moving motorcycles!
A breathtaking display of courage, teamwork, and skill by our heroes. Saluting their indomitable spirit! #IndianArmy #WorldRecord #PrideOfIndia #Unstoppable pic.twitter.com/zl0WN99m4X— Renbeni Kikon (@kikon_renbeni) January 21, 2025