Horoscope Today: శనివారం, 02-05-2026 నాటి మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఎవరెవరికి సమస్యలు ఎదురవుతాయి? ఏ రాశి వారికి ఉద్యోగంలో మరియు ఇంట్లో సానుకూల పరిస్థితులు లభిస్తాయి? మేషరాశి నుండి మీనరాశి వరకు నేటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. చిన్నచిన్న పొరపాట్లను లేదా విషయాలను భూతద్దంలో చూడకుండా ముందుకు సాగడం మంచిది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- పరిహారం: నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల ఆపదలు తొలగుతాయి.
వృషభం
మీరు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో మీ అధికార పరిధి పెరిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.
- పరిహారం: శివస్తోత్రం చదువుకోవడం ఉత్తమం.
మిథునం
వృత్తి, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా వ్యవహరించండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.
- పరిహారం: నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కర్కాటకం
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే, కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు, సంయమనంతో వ్యవహరించండి.
- పరిహారం: దక్షిణామూర్తి అష్టకం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
సింహం
మీకు అవసరమైన సమయంలో తగిన సహాయం అందుతుంది. అయితే, సన్నిహితులు ఇచ్చే సలహాలను బేఖాతరు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. శారీరక అలసట ఉంటుంది.
- పరిహారం: శివారాధన చేయడం వల్ల మానసిక బలం లభిస్తుంది.
కన్య
ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. మీరు మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు సొంత నిర్ణయాలపై నమ్మకంతో ముందుకు సాగాలి. ఇతరుల ప్రభావానికి లోనుకావద్దు.
- పరిహారం: దుర్గాదేవిని ధ్యానించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల
ఈరోజు మీకు అదృష్టం కలిసివస్తుంది. వచ్చే అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా అందిపుచ్చుకోండి. అన్ని రంగాల వారికి పురోభివృద్ధి కనిపిస్తోంది. క్లిష్టమైన సమస్యల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు.
- పరిహారం: శివారాధన శుభప్రదం.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు జరిగే ఒక సంఘటన మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
- పరిహారం: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు
చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన మంచి వార్త వింటారు. రోజంతా మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.
- పరిహారం: ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
మకరం
ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత ఉంటుంది. మీ మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. బంధువులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి భోజన సౌఖ్యం లభిస్తుంది.
- పరిహారం: ఇష్టదైవారాధన శుభప్రదం.
కుంభం
పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయంలో ముందుజాగ్రత్త అవసరం, లేకపోతే వృథా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కొంత బాధకు గురిచేయవచ్చు.
- పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మీనం
వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటి ఉద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.
- పరిహారం: ఈశ్వర ఆరాధన వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
