Madhya Pradesh: బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో మరో రెండు ఏనుగులు చనిపోయాయి. ఈ కేసులో ఎస్టీఎఫ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో 7 పొలాలు, 7 ఇళ్లలో సోదాలు చేసింది. అలాగే ఐదుగురిని విచారించారు. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నేడు ద్వారకాతిరుమలలో డిప్యూటి సీఎం పవన్ పర్యటన
అక్టోబరు 30న బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సల్ఖానియా, ఖతౌలీ, పాటోర్ శ్రేణుల సరిహద్దులోని బహిరంగ మైదానంలో 300 మీటర్ల పరిధిలో 10 ఏనుగులు స్పృహ తప్పి పడివుండడం గమనించారు. విషయం తెలిసి అధికారులు అక్కడికి చేరుకునేసరిగి 6 ఏనుగులు మృతి చెంది ఉన్నాయి. మరో నాలుగిటిని వైద్య సహాయం కోసం తీసుకువెళ్లారు అయితే, ఆ నాలుగు ఏనుగులు కూడా మరణించాయి. స్పాట్ లోనే 6 మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.