AP News

AP News: అరె ఏంట్రా ఇదీ ! ఒక్కడి కోసం ఇద్దరు.. ఆత్మహత్యకు తెగించిన యువతులు..

AP News: అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతులు అతడి కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ మర్మం బహిర్గతం 

అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన దివాకర్, ముదిగుబ్బకు చెందిన రేష్మ, కనేకల్‌కు చెందిన శారద ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. విద్యార్థిదశలోనే దివాకర్, రేష్మ ప్రేమలో పడ్డారు. అయితే, రెండు సంవత్సరాల క్రితం రేష్మ వివాహం కావడంతో, దివాకర్ ఆమె స్నేహితురాలు శారదతో ప్రేమాయణం ప్రారంభించాడు.

పెళ్లయిన తర్వాత కూడా దివాకర్‌ను మర్చిపోలేక, భర్తను వదిలేసి రేష్మ అతని వద్దకు తిరిగి వచ్చింది. ఇదే సమయంలో శారదతో కూడా దివాకర్ ప్రేమలో ఉండటంతో, ఇద్దరికీ తెలియకుండా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొనసాగించాడు.

Also Read: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్ . . ఈరోజే బ్యాంకు ఎకౌంట్స్ లోకి డబ్బులు

ఇన్‌స్టా చాట్‌లో బయటపడిన నిజం

రేష్మ, శారద స్నేహితులే కావడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో వారి సంభాషణ ద్వారా ఈ ట్రయాంగిల్ లవ్ వ్యవహారం బయటపడింది. బాయ్‌ఫ్రెండ్ దివాకర్‌ను ఈ విషయం గురించి నిలదీయగా, ఒత్తిడికి గురైన అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

దివాకర్ స్పందించకపోవడంతో, తమలో ఎవరో ఒకరు మాత్రమే అతని జీవితంలో ఉండాలని నిర్ణయించిన రేష్మ, శారద, ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగారు.

ఘటనపై పోలీసుల విచారణ

ఈ ఘటనలో శారద మృతి చెందగా, రేష్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుడు దివాకర్ మోసగాడా? లేకపోతే ఏదైనా ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *