Hyderabad: ఉద‌యం స్కూల్‌కెళ్లారు.. సాయంత్రం అదృశ్యమ‌య్యారు! హైద‌రాబాద్‌లో విద్యార్థినుల మిస్సింగ్‌

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇద్ద‌రు పాఠ‌శాల విద్యార్థినులు అదృశ్య‌మైన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఉద‌యం పాఠ‌శాల‌కు వెళ్లిన ఆ ఇద్ద‌రినీ ఇంటికి తీసుకొచ్చేందుకు త‌ల్లిదండ్రులు వెళ్లేస‌రికి క‌నిపించ‌కుండా పోయారు. దీంతో ఎంత వెతికినా వారి ఆచూకీ దొర‌క‌క‌పోవ‌డంతో వారిలో ఆందోళ‌న నెల‌కొని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌కర విష‌యంతో పాఠ‌శాల‌ల‌కు బాలిక‌ల‌ను పంపే త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన్న‌ది.

Hyderabad:న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని వివేకానంద‌న‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ చైత‌న్య టెక్నో స్కూల్‌లో ఆ ఇద్ద‌రు విద్యార్థినులు 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. వారిద్ద‌రినీ ఉద‌యం 8:30 గంట‌ల‌కు రోజూ మాదిరిగానే వారి త‌ల్లిదండ్రులు స్కూల్‌లో వ‌దిలి వెళ్లారు. సాయంత్రం స్కూల్ వ‌దిలే స‌మ‌య‌మైన 5:30 గంట‌ల‌కు తీసుకొచ్చేందుకు వారి త‌ల్లిదండ్రులు వెళ్లారు. త‌మ పిల్ల‌లు కాన‌రాక‌పోవ‌డంతో స్కూల్ ప్రిన్సిపాల్‌ను, ఇత‌ర ఉపాధ్యాయుల‌ను వాక‌బు చేశారు. ఇప్పుడే వెళ్లిపోయార‌ని చెప్ప‌డంతో వారిలో ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

Hyderabad:స‌మీప దుకాణాల్లో, రోడ్డుపై, బ‌స్టాండ్ వ‌ద్ద వెతికినా ఆ ఇద్ద‌రు విద్యార్థినుల ఆచూకీ దొర‌క‌లేదు. దీంతో చేసేది లేక స‌మీప పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. త‌మ పిల్ల‌ల‌ను ఎలాగైనా వెతికి క్షేమంగా త‌మ వద్ద‌కు చేర్చాల‌ని ఆ చిన్నారుల త‌ల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *