Turning Point: వైవిధ్యమైన కథాంశాలతో రూపుదిద్దుకునే చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటాడు త్రిగుణ్ గా పేరు మార్చుకున్న అదిత్ అరుణ్. అతను హీరోగా, హెబ్బాపటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించిన సినిమా ‘టర్నింగ్ పాయింట్’. కుహన్ నాయుడు దర్శకత్వంలో సురేశ్ దత్తి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల విడుదల చేశారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తమ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ‘టర్నింగ్ పాయింట్’ మేకర్స్ చెబుతున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో త్రిగుణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. హీరోగానే కాకుండా మంచి పాత్ర లభిస్తే దానికీ న్యాయం చేకూర్చడానికి త్రిగుణ్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన ‘మనమే’లోనూ అతనో కీ-రోల్ ప్లే చేశాడు.