Abbas-Mustan: బాలీవుడ్ లోని జంట దర్శకులు అబ్బాస్ – మస్తాన్ కు మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించిన ‘బాజీగర్’ మూవీ కూడా అందులో ఒకటి. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు నిర్మాత రతన్ జైన్. ఈ విషయమై షారూక్ ఖాన్ తోనూ చర్చలు జరుపుతున్నామని, ఓ కొత్త దర్శకుడితో దీనిని నిర్మిస్తానని చెబుతున్నారు. అలానే అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలోనే 2004లో వచ్చిన చిత్రం ‘ఐతరాజ్’. దీనిని ప్రముఖ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రొడ్యస్ చేశారు. ఇప్పుడీ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంలో దీనికి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు సుభాష్ ఘాయ్. దర్శకుడు అమిత్ రాయ్ యువతను ఆకట్టుకునేలా ‘ఐతరాజ్’కు సీక్వెల్ కథను రెడీ చేశాడని, అతని దర్శకత్వంలోనే మూవీని నిర్మిస్తానని సుభాష్ ఘాయ్ చెబుతున్నారు.