Thaman: ఇటీవల ఆర్టీసీ బస్ లో ఓ దివ్యాంగ గాయకుడు పాడిన పాటను ఓ తోటి ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దానిని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ట్యాగ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అతనికో అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా ఆ గాయకుడి టాలెంట్ కు ఫిదా అయిన తమన్ ఆహా ఓటీటీ సంస్థ నిర్వహించే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో అతనికి అవకాశం ఇవ్వబోతున్నాట్టు తెలిపారు. ఇది తన కోరిక, ఆర్డర్ కూడా అంటూ ఆహా వారికి తెలిపారు తమన్. ఆ గాయకుడితో కలిసి తానూ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తానని పేర్కొన్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినప్పుడు మనుషులమైన మనం వారిని ప్రత్యేక స్థానంలో నిలపాలి అంటూ తమన్ పేర్కొన్నాడు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024