TTD

TTD: కల్తీ నెయ్యి కేసులో సంచలన పరిణామం – ఇద్దరు టీటీడీ ఉద్యోగుల అరెస్ట్

TTD: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెయ్యి కల్తీ కేసు నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ (ఏసీపీ) కోర్టుకు గురువారం బదిలీ అయింది. ఆ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజ్ఞప్తి మేరకు తిరుపతిలోని 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లోగా సంబంధిత రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న సిట్ అధికారులు, టీటీడీకి చెందిన ఇద్దరు ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అదుపులో తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ పరిధిలోని దేవాలయాల ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల సిట్ గత ఏడాది నవంబర్ 22 నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో నెయ్యి సరఫరాలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సరఫరాదారులను అరెస్టు చేసి సిట్ అధికారులు రెండు విడతలుగా కస్టడీకి తీసుకుని విచారించిన విషయం కూడా విదితమే. తాజాగా సిట్ బృందం దాఖలు చేసిన పిటిషన్లో లో కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పని చేసే ఇద్దరు (ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్) ఉద్యోగులపై అవినీతి నిరోధకచట్టం సెక్షన్లు 7, 8 కింద అదుపులో తీసుకుని విచారించడానికి అనుమతి కూడా కోరారు.

Also Read: Telangana: ఈ చిత్రం.. రైతు బ‌తుకు దైన్యం (రైతు వీడియో)

TTD: ఈ క్రమంలో స్పందించిన తిరుపతి 2వ అదనప కోర్టు న్యాయమూర్తి మొత్తం కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీచేశారు. ఆ మేరకు సిట్ అధికారులు స్థానిక కోర్టు ఆధీనంలోని కేసు సంబంధిత డాక్యుమెంట్లను, సమర్పించిన సాక్షాధారాల రికార్డులను తిరిగి తీసుకున్నారు. వాటిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు సమర్పించాక ఒకటి రెండు రోజుల్లో కేసు విచారణ ప్రక్రియ నెల్లూరు ఏసీబీ కోర్టునుంచే మొదలవుతుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

మొత్తం మీద తాజా పరిణామాలతో కేసు విచారణ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ కావడం తో పాటు టీటీడీలో పనిచేసే ఇద్దరు అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించడంతో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తు ఊపందుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం సహజంగానే టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటు సంచలన చర్చ జరుగుతుంది.

ALSO READ  Raana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు: రానాకు ఈడీ మరోసారి నోటీసు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *