TSPSC:

TSPSC: సెలెక్టెడ్ జేఎల్‌ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌

TSPSC: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఎల్ అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపికైన 1286 మంది అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అధికారులు ఏర్ప‌ట్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల (మార్చి) 12న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లుగా ఎంపికైన వారికి నియామ‌క‌ప‌త్రాలను అంద‌జేయ‌నున్నారు.

TSPSC: గ‌త నెల‌లోనే ఎంపికైన అభ్య‌ర్థులు అంద‌రికీ ఇంట‌ర్మీటియ‌ట్ విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వ‌హించి పోస్టింగ్‌లు కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో వారికి నియామ‌క‌ప‌త్రాల అంద‌జేత ప్ర‌క్రియ నిలిచిపోయింది. దీంతో ఆ ఎన్నిక‌ల కోడ్ ముగియ‌డంతో బుధవారం (మార్చి 12) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం చేతుల‌మీదుగా స్వ‌యంగా నియామ‌క‌ప‌త్రాల‌ను అంద‌జేయ‌నున్నారు.

TSPSC: 14 సంవ‌త్స‌రాల తర్వాత జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింది. 1392 జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు 2023లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. 2024లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ జ‌రిగింది. ఆ త‌ర్వాత నియామ‌క ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రిగింది. అయితే తాజాగా ప్ర‌భుత్వం నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వ‌నున్న‌ద‌ని తెలియ‌డంతో అభ్య‌ర్థుల్లో ఆనందం నెల‌కొన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *