TS Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి 211 ఎకరాల భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమికేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్-ఎల్బీ నగర్-హయత్ నగర్, రెండోది ఎల్బీ నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
TS Cabinet: అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రెరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమీషన్‌ను ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్‌గ్రౌండ్స్ భూమి బదలాయించాలని కేబినెట్ నిర్ణయించింది.