Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయం తీసుకొని తొలి యాక్షన్‌కు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ తాజాగా వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆమె ప్రకటించారు.
Donald Trump: అమెరికా దేశంలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రకటించారు. దీంతో అక్కడ అక్రమ నివాసితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. దీంతో అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది.